ఆహారంలో ఉప్పు కారం తగ్గిస్తే నరాలపై ఒత్తిడి తగ్గి బలపడతాయి : డాక్టర్ సంతోష్ పేండ్కర్
ప్రస్తుత పరిస్థితుల్లో నరాల బలహీనతతో ఎంతోమంది బాధపడుతున్న తరుణంలో ఆదివారంపల్సి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల వైద్యుడు డాక్టర్ సంతోష్ పేండ్కర్ కుభీర్ లో ‘నరాల బలహీనతకు ఆయుర్వేద వైద్యం’పై పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అశ్వగంధ, శతావరి వంటి మూలికలు, విటమిన్ బి12 ఉన్న ఆహారాలు, పాలు, బాదం, ఖర్జూరాలు తీసుకోవడం ద్వారా నరాల శక్తి పెరుగుతుందని అన్నారు. శీర్షాసనం వంటి యోగాసనాలు రక్త ప్రసరణను మెరుగుపరిచి నరాలను బలపరుస్తాయని తెలిపారు. నరాల బలహీనతకు ఆయుర్వేద చికిత్స, అశ్వగంధ నరాలకు బలాన్ని ఇచ్చే అత్యుత్తమ మూలిక అన్నారు. అశ్వగంధ పొడిని పాలతో తీసుకుంటే నరాల బలహీనత తగ్గుముఖం పడుతుందన్నారు. శతావరి ఈ మూలిక నరాల వ్యవస్థను ప్రశాంతపరిచి, బలాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. నాడీ బలానికి తైలాలు చాలా బాగా ఉపయోగపడతాయని నువ్వుల నూనె లేదా మహానారాయణ తైలంతో మసాజ్ చేసుకోవడం వల్ల నరాల నొప్పి, తిమ్మిర్లు తగ్గుతాయన్నారు. నరాల పనితీరు మెరుగుపడటానికి ఆహార నియమాలు పాటించాలని అన్నారు.





