బీఎస్పీ నాయకులను కలిసిన మానేపల్లి బెజ్జురు మండల ప్రజలు.
ఆసిఫాబాద్ :- కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లోని సిర్పూర్ అసెంబ్లీ లో చింతల మానేపల్లి మండలం గూడెం గ్రామ ప్రజలు, బెజ్జర్ మండలం లంబిని నగర్ గ్రామ ప్రజలు ఈ రోజు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిషాని రామచంద్రం ని కలిసి వారి సమస్యల గోడు వినిపించారు. గూడెం గ్రామం లో బుద్ధ విహార్ యొక్క 10 గుంటల స్థలం ను స్థానిక నాయకులు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పగా వెంటనే నిషాని రామచంద్రం అడిషనల్ కలెక్టర్ తో మాట్లాడగా ఆయన స్పందించి స్టానిక తహసీల్దార్ ని ఎవరూ ఆక్రమించకుండా చూడాలని ఆదేశించారు. లంబిని నగర్ లో గత 40 సంవత్సరాల నుండి వ్యవసాయం ఇండ్లు కట్టుకొని జీవిస్తున్న ప్రజలకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు వేదిస్తున్నారు అని గోడు వినిపిస్తే క్షేత్ర స్థాయి విచారణ జరిపి వారందరికీ పట్టాలు ఇవ్వాలని కలెక్టర్ ని కోరారు.
ఈ కార్యక్రమం లో ఈ సి మెంబర్ శెట్టి ప్రవళిక శెట్టి శంకరయ్య పార్లమెంట్ ఇంచార్జ్ సాలం బిన్ హాసన్, జిల్లా అధ్యక్షులు దుర్గం తుకారాం, ఉపాధ్యక్షులు ముదస్సిర్ హుస్సేన్, మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిరాజుద్దీన్ నాగుల కిరణ్ బాబు పాల్గొన్నారు.





