ప్రాంతీయం

ఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క

8 Views

ఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు – రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క.

మంచిర్యాల జిల్లా ,జూన్ 13, 2026:
ఆధ్యాత్మికతలో ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ప్రణాళికా శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని శ్రీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐ.టి., ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, రాష్ట్ర షెడ్యూల్ తెగలు, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల, రామగుండం నియోజకవర్గాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, రాజ్ ఠాకూర్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్, మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అమలు చేస్తుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల అభివృద్ధికి 2 వేల 216 కోట్ల రూపాయలతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రాబోవు గోదావరి పుష్కరాల కొరకు 1 వేయి కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇందులో భాగంగా 3 కోట్ల రూపాయల గోదావరి పుష్కరాల అంచనా నిధులతో ఆలయ పున: నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనులకు, నగరపాలక సంస్థ పరిధిలో 1 కోటి 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో డివిజనల్ కార్యాలయాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *