ప్రాంతీయం

చీకోడు జీపీ సిబ్బందికి సత్కారం,నిత్యావసరాల పంపిణీ చేసిన ఎస్సై కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి

36 Views

 

జీపీ కార్మికులను సత్కరించిన ఎస్సై కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి

-నిత్యావసరసరుకులపంపిణీ, శాలువాలతో సత్కారం

తెలుగు న్యూస్ 24×7: ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామానికి చెందిన కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి ఉద్యోగరిత్యా సిద్దిపేటలో విధులు నిర్వహిస్తున్నా.. తన స్వగ్రామం పై మక్కువను కోల్పోకుండా గ్రామపంచాయతీ సిబ్బంది సేవలను గుర్తించి సన్మానించడం నేటి యువతకు స్పూర్తిగా నిలిచింది.చీకోడు గ్రామంలో పుట్టి పెరిగిన కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం సిద్దిపేటలో ఎస్సై గా విధులు నిర్వర్తిస్తున్నారు తన స్వగ్రామానికి తన వంతు సహకారం అందించాలని భావించిన ఎస్సై ముందుగా ప్రతీ రోజు గ్రామానికి సేవలందించే గ్రామపంచాయతీ కార్మికులను సత్కరించి,చిరు సహాయం చేయాలని తలంచారు.అందులో బాగంగా గురువారం జీపీ వద్ద సిబ్బందికి నెల రోజులకు సరిపడ నిత్యావసర సరుకులు పంపిణీ చేసి,నూతన వస్త్రాలు అందించి,శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా పురప్రముఖులు రాజకీయ నాయకులు కరెడ్ల మల్లారెడ్డి మాట్లాడుతూ ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగం చేస్తూ తన స్వగ్రామాన్ని మర్చిపోకుండా సేవలు అందించడానికి ముందుకు వచ్చి గ్రామ స్థాయి సిబ్బంది సేవలను గుర్తించి వారిని గౌరవించిన ఎస్సై కరెడ్ల శ్రీనివాస్ రెడ్డి,నేటి యువతకు ఆదర్శం అని అన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని సేవలు అందించడానికి కృషి చేయాలని కోరుతూ గ్రామస్తుల తరపున ఎస్సై కి ధన్యవాదాలు తెలిపారు.జీపి సిబ్బంది సైతం ఎస్సై కి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు,కరెడ్ల యాదగిరి రెడ్డి,కరెడ్ల నర్సారెడ్డి,తిరుమల్ రెడ్డి, రాజిరెడ్డి,వార్డు సభ్యులు బాధ నరేష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *