తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) మార్చి 28
*_శ్రీరామ్ సాగర్ నీటిని పరిశీలించిన ఎమ్మెల్యే పాలకుర్తి శాసనసభ్యురాలు యశస్విని ఝాన్సి రెడ్డి*
*_పచ్చని పంట పొలాలలో కలియతిరుగుతూ రైతులతో మాట్లాడుతూ సంతోషం వ్యక్తం చేసిన స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి*
గురువారం కొడకండ్ల మండల పర్యటనలో భాగంగా మండల కేంద్రం శివారు హక్య తండ వద్దనున్న కెనాల్ నీటి ప్రవాహాన్ని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి పరిశీలించారు.
అందుబాటులో ఉన్న రైతులతో ఆమె మాట్లాడారు ఎస్సారెస్పీ రెండవ దశ కెనాల్ ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలను వినియోగించుకుంటున్న తీరును ఆమె రైతులను అడిగి తెలుసుకున్నారు.
బయ్యన్నవాగు రిజర్వాయర్ ద్వారా 67, 69, 70,71 డిబిఎంల ద్వారా ప్రవహిస్తున్న గోదావరి జలాలను ఆయా ప్రాంతాల రైతులు పండించే పంటలకు వినియోగించుకుంటూ ఆనందోత్సవాల్లో స్థానిక రైతాంగం ఉందని ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి అన్నారు.
రెండొ దశ కాలువ ద్వారా ప్రతిరోజు 1700 క్యూసెక్కుల నీటిని ప్రభుత్వం విడుదల చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు ఆయా నీటితో ఒక లక్ష 69 వేల ఎకరాల పంటలకు గోదావరి జలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు.




