ప్రాంతీయం

సైబర్ జాగృతి దివస్ సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు

16 Views

రామగుండం పోలీస్ కమీషనరేట్

సైబర్ జాగృతి దివస్ సందర్భంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు

సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ షికా గోయల్ ఆదేశాల మేరకు మరియు రామగుండం కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వుల ప్రకారం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డిఎస్పి వెంకట రంగా రెడ్డి, ఇన్స్పెక్టర్ శ్రీ కృష్ణమూర్తి, రామగుండం కమీషనరేట్ ఇన్స్పెక్టర్ నాగపూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సైబర్ జాగ్రత్త దివాస్ సందర్బంగా వీటీసీ ట్రైనింగ్ సెంటర్ గోదావరిఖని, ఐటిఐ కాలేజ్ పెద్దపల్లి, పన్నూరు విలేజ్ లో మహిళలకు, కాలేజీ స్టూడెంట్స్ కి సైబర్ క్రైమ్ పట్ల అవగాహన కల్పించడం జరిగింది. ఆదేవిదంగా కమీషనరేట్ పరిధిలో గల ప్రతి పోలీస్ స్టేషన్లోని సైబర్ వారియర్స్ కూడా సైబర్ జాగృతి దివాస్ సందర్బంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

ప్రజలు ఎవరు కూడా ఆన్లైన్ గేమ్స్ మరియు ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ , లోన్ యాప్స్ , డిజిటల్ అరెస్ట్ , మల్టీ లెవెల్ మార్కెటింగ్ , క్రిప్టో కరెన్సీ , ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్ , ఓటిపి, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ లను నమ్మి మోసపోకూడదనో తెలిపారు. సులభంగా డబ్బులు వస్తాయని నమ్మి ఎటువంటి ఆన్లైన్ యాప్స్ లలో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని, సైబర్ మోసాలకు గురవకుండా జాగ్రత్తగా ఉండాలి. మ్యాట్రిమొనియల్ ద్వారా వచ్చే ఎటువంటి అపరిచిత వ్యక్తుల కాల్స్ మెసేజెస్ లను నమ్మి ప్రజలు మోసపోకూడదు అని రామగుండం సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ వెంకట రంగారెడ్డి గారు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *