ప్రాంతీయం

అధిక వసూళ్ల గ్యాస్ దందా…

64 Views

ముస్తాబాద్, ఏప్రిల్ 1 (24/7న్యూస్ ప్రతినిధి): ఇరాన్‌పై ఇజ్రయేల్‌, అమెరికా యుద్ధం ప్రభావంతో గ్యాస్‌ దొరకక, వినియోగదారులు అవస్థలు పాడుతున్నట్లు విధితమే.. రోజులు గడిచినా గ్యాస్ బుక్ అవకపోవడంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అదునుగా చేసుకొని సిల్లిండర్ల బ్లాక్‌ దందా జోరుగా సాగుతున్నట్లు సమాచారం. ముస్తాబాద్ మండలంలో గ్యాస్‌ సిలిండర్లతో గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బ్లాక్‌లో కన్జ్యూమర్ వద్ద డబుల్ రేటు అందేవరకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఓవైపు ప్రభుత్వాలు సిలిండర్ల కొరత లేదని అంటూనే ఉండగా మరోవైపు వినియోగదారులను ఆసరా చేసుకుని అందిన గాడికి దోచుకుంటున్నట్లు ఏందని స్థానికుల ఆవేదన. ఇప్పుడున్న పరిస్థితుల్లో వినియోగదారులు తప్పనిసరి పరిస్థితులలో సిలిండర్కు డబ్బులు ఎంతైనా పెట్టి తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఇకపోతే గ్యాస్ కొరత ఏర్పడిందని పలు ఓటల్లలో ధరలపట్టిక బోర్డువేసి  టిఫిన్ చార్జీలు కూడా పెంచారు. గ్యాస్ పై అధికవసూళ్ల దందాను అరికట్టాల్సిన బాధ్యత అధికారులకు ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *