అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పించిన డ్రైవర్ హోమ్ గార్డ్ తేజ.
ప్రధాన రహదారిపై తెగిన కరెంట్ వైర్లను గుర్తించి అప్రమత్తంగా వ్యవహరించిన తేజ.
తంగలపల్లి మండల కేంద్రంలో సోమవారం రోజున రాత్రి సుమారు రెండు గంటల సమయంలో ఉధృతంగా వీచిన గాలులకు తాడూర్ చౌరస్తా వద్ద రోడ్డుకు అడ్డంగా కరెంట్ వైర్లు తెగి పడ్డాయి,అదే సమయంలో సిరిసిల్ల డిఎస్పి నాగేంద్ర చారి వాహనం పెట్రోలింగ్ నిర్వహిస్తూ అటు వైపు వెళ్తుండగా వాహన డ్రైవర్ తేజ నడిరోడ్డుపై తెగిపడిన విద్యుత్తు తీగలను గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు.వాహనాన్ని పక్కన నిలిపి ప్రమాదాన్ని అంచనా వేసి,డిఎస్పీ కి తెలియజేయగా వెంటనే సంబంధిత శాఖ అధికారులతో డి.ఎస్.పి మాట్లాడి రోడ్డుపై పడి ఉన్న విద్యుత్ తగలను తొలగించి సరి చేయడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించగలిగారు. ముందుగానే ప్రమాదాన్ని గుర్తించి డ్రైవర్ తేజ చూపిన చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పినట్లు అయిందని విద్యుత్ సరఫరా కలిగిన తీగలకు ఎవరు తగిలిన పెను ప్రమాదం జరిగేదని.డ్రైవర్ అంటే కేవలం వాహనం నడిపేవారే కాకుండా,అప్రమత్తతతో ప్రజల ప్రాణాలను కాపాడగల బాధ్యతగల వ్యక్తి అని తెలుపుతూ పోలీసు ఉన్నతాధికారులు తేజను అభినందించారు.





