
ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కట్టిస్తాం: డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్
ఆపన్నులకు అండగా నిలుస్తాం
ఏదైతే చెప్తామో అదే చేస్తాం చెప్పింది చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజం
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో పర్యటించిన డీసీసీ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ రాచర్ల గొల్లపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు,అనంతరం రాజన్నపేట,బొప్పాపుర్,పదిర గ్రామాల్లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే పేద బడుగు బలహీనవర్గాల పార్టీ అని,ఏదైతే చెప్తామో అదే చేస్తామని చెప్పింది చేయడమే కాంగ్రెస్ పార్టీ నైజం అని అన్నారు. పదిమంది నిరుపేదలు ఆసుపత్రిపాలై అప్పుల పాలై తమ దీనస్థితిని దరఖాస్తు రూపంలో ప్రభుత్వానికి మొర పెట్టుకుంటే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి నేరుగా లబ్ధిదారుని ఖాతాలోకి ఆసుపత్రి ఖర్చులను పంపించడం జరుగుతుందని ఆపన్నులకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు.సుమారు పదిమంది లబ్ధిదారులకు3,53,500 రూపాయల విలువ గల చెక్కుల పంపిణీ చేయడం జరిగిందన్నారు.గృహప్రవేశాలలో పాల్గొంటూ మండలంలో నిరుపేదలు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకంతో సొంత జాగాలో ఇల్లు కట్టుకుంటూ ఐదు లక్షలు లబ్ధి పొంది ఇల్లు కట్టుకొని పండగ వాతావరణం లో గృహప్రవేశాలు చేసుకుంటూ అట్టి కార్యక్రమాలకు లబ్ధిదారులు మమ్మల్ని ఆహ్వానించడమే మా పాలనకు నిదర్శనం అన్నారు.కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు హామీల అమలును చూసి అసెంబ్లీలో ప్రతిపక్షం అధికార పక్షాన్ని ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను గుర్తు చేస్తూ దరఖాస్తు పెట్టుకొని అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది అన్నారు.రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా ప్రతి కుటుంబ సభ్యుడికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,వడ్డీ లేని రుణాలు,200 యూనిట్ల వరకు గృహ విద్యుత్తు వినియోగ దారులకు ఉచిత కరెంటు,500 రూపాయలకే గ్యాస్ సిలిండర్,ఇస్తున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వందే అన్నారు.ప్రతి పేదవాడికి ఉపయోగపడే పథకాలను అమలు చేస్తూ ప్రభుత్వంపై ఎంత భారం ఉన్నా సంక్షేమంలో రాజీ పడడం లేదు అన్నారు.ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చడంలో భాగంగా రానున్న రోజుల్లో నూతన పెన్షన్ అమలు,దశల వారీగా పెన్షన్ పెంపు అంశాలపై ప్రభుత్వం కసరత్తు చేస్తుందన్నారు. ఇవన్నీ గమనిస్తున్న ప్రజలు లబ్ధి పొందుతున్న ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడుతుంటే ప్రతిపక్షాలు నివ్వెర పోతున్నాయని,భవిష్యత్తులో ఇచ్చిన హామీలు అమలు చేయడంతో పాటు పేద ప్రజలకు చేయాల్సినవి,హామీలు ఇవ్వకున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు మేలు జరిగే నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సాభేరా బేగం,ఎంపీడీఓ సత్తయ్య,జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సాహెబ్,కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి,సీనియర్ నాయకులు చేపూరి రాజేశం,బండారి బాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మెండే శ్రీనివాస్,మర్రి నారాయణరెడ్డి,యువ నాయకులు గుర్రాల రాజిరెడ్డి, గుడ్ల శ్రీనివాస్,దుంపేటి జనార్ధన్,పందిళ్ళ నారాయణ గౌడ్,పందిళ్ళ సుధాకర్ గౌడ్,గోగూరి శ్రీనివాసరెడ్డి ఆయా గ్రామాల నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లబ్ధిదారులు పాల్గొన్నారు.





