-ప్రజాహిత యాత్ర కాదు, ప్రజా వ్యతిరేక యాత్ర
– బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు
(మానకొండూర్ మార్చి 17)
కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రజాహిత యాత్రను విజయవంతంగా ముగించానని గర్వంగా చెప్పుకుంటున్నారని, ప్రజల దృష్టిలో ప్రజా వ్యతిరేక యాత్ర అని భావిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జి.వి రామకృష్ణారావు అన్నారు.
ఆదివారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.వి రామకృష్ణారావు మాట్లాడుతూ…
కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రజాహిత యాత్రను విజయవంతంగా ముగించానని గర్వంగా చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, ప్రజాహిత యాత్ర అని ఎందుకు పెట్టుకున్నారో కాని, ప్రజలు దాన్ని మాత్రం ప్రజావ్యతిరేక యాత్రగా భావిస్తున్నారని అన్నారు.
బండి సంజయ్ ఎంపీగా గెలిచినప్పటి నుండి తాను ప్రజలకు చేసిన వాగ్దానాలలో ఏ ఒక్కటి కూడా నెర వేర్చలేదని, హితం కంటే వ్యతిరేకత ఎక్కువ ఉంది కాబట్టి ప్రజలు వ్యతిరేక యాత్ర అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.250 గ్రామాలు 750 కిలో మీటర్లు తిరిగానని గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ ఎంపిగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గానికి ఎన్ని రూపాయల నిధులు తీసుకువచ్చావని ప్రజలు అడిగిన ప్రశ్నలకు బండి సంజయ్ వద్ద సమాధానం లేదన్నారు.
పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గంలో బండి సంజయ్ కి పెద్దగా గుర్తింపు లేదని, కానీ వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు 1000 కోట్లతో కరీంనగర్ స్మార్ట్ సిటీని తీసుకొచ్చాడని, సర్కస్ గ్రౌండ్ ని జ్యోతిరావు పూలే గ్రౌండ్, ఏడు కోట్ల రూపాయలతో సింథటిక్ వాకింగ్ ట్రాకింగ్ ఏర్పాటు, రైల్వే లైన్లు, నాలుగు లైన్ల రహదారి ఎన్నో అభివృద్ధి పనులు చేశాడని గుర్తు చేశారు.
బండి సంజయ్ మాట్లాడితే నోటి నుండి వచ్చేది రాముని పేరేనని, దేవుని పేరు చెప్పుకొని రాజకీయం చేయడం, రాముని పేరును అప్రతిష్టపాలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఒక్కసారి రాముని పేరు పక్కనపెట్టి జనాల్లోకి ప్రచారానికి వెళితే తెలుస్తుందని, పోయిన సారి ఏదో సెంటిమెంట్ తో గెలిచాడు, ఈసారి ప్రజలు బోయినపల్లి వినోద్ కుమార్ ను భారీ మెజారిటీతో గెలిపించడం ఖాయ మని ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్పీటీసీ తాళ్లపెల్లి శేకర్ గౌడ్, రామంచ గోపాల్ రెడ్డి, శాతరాజు యాదగిరి, శేకర్, నెల్లి శంకర్, ఈసుకుల అంజి, సందీప్, రఘు, తదితరులు పాల్గొన్నారు.