అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య, కార్యక్రమాలు, త్రాగునీరు సరఫరా సక్రమంగా నిర్వహించాలి,జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్,
సిద్దిపేట, మార్చి 28, తెలుగు న్యూస్ 24/7
పట్టణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని మున్సిపాలిటీలలో పారిశుద్ధ్య, కార్యక్రమాలు, త్రాగునీరు సరఫరా సక్రమంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అబ్దుల్ హమీద్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.శనివారం కలెక్టరేట్లోనే తన ఛాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వేసవి కాలంలో త్రాగునీరు సరఫరాలో ఇబ్బంది కలగకుండా అని మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా పర్యవేక్షించాలని, పట్టణాలు అపరిశుభ్రంగా ఉంటే ప్రజల ఆరోగ్యం బాగుండదని కచ్చితంగా ప్రతి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. పట్టణానికి ఆదాయాన్ని సమకూర్చే పన్నులను కూడా సకాలంలో వసూలు చేయాలని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణ ప్రభుత్వం సూచించిన విధంగా కచ్చితంగా అమలు చేసి ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేసి పట్టణాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో హుస్నాబాద్, దుబ్బాక, గజ్వేల్, చేర్యాల మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.





