ప్రాంతీయం

ఖమ్మం ప్రెస్ క్లబ్‌ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

71 Views

ఖమ్మం ప్రెస్ క్లబ్‌ లో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

టిడబ్ల్యూజేఎఫ్ ( హెచ్-2843) యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ

ఖమ్మం , జనవరి 26, తెలుగు న్యూస్ 24/7

ఖమ్మం నగర ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ ఆధ్వర్యంలో నగర ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అంతోటి శ్రీనివాస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు, అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ, 1950 జనవరి 26 తేదీ రోజున భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి భారత్ గణతంత్ర దేశంగా మారింది. దీనిని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన రాజ్యాంగం తేదీ కావున ప్రతి సంవత్సరం జనవరి 26న గణతంత్ర వేడుకలు జరుపుకోవాలని దేశంలో మహనీయులు మేధావులు నిర్ణయించారు. ఆనాటి నుండి మన భారత దేశంలో రాజ్యాంగం ప్రకారం స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం, సార్వభౌమాధికారం ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది దేశభక్తి, రాజ్యాంగ విలువలు, ప్రజాసామ్యంకు ప్రాధాన్యత పై సందేశం ఇచ్చారు.భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను ప్రతి భారత పౌరుడు గౌరవించాలని, ఇదే సమయంలో దేశ అభివృద్ధికి పాటుపడలని ఆయన పిలుపునిచ్చారు. దేశం లో నల్గొవా స్తంభంగా మీడియా ఉందని సమాజానికి మార్గదర్శిగా నిలవాలని, సత్యం, నైతిక విలువలతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు గా టిడబ్ల్యూజేఎఫ్ (హెచ్-2843) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్ చక్రవర్తి, నానబాల రామ కృష్ణ, ఖమ్మం జిల్లా కోశాధికారి ఆర్వపల్లి నగేష్, టీ.బీ.జె.ఎ జిల్లా అధ్యక్షులు వందనపు సామ్రాట్ గుప్తా, వీడియో గ్రాఫర్స్ జిల్లా అధ్యక్షులు అమరబోయిన ఉపేందర్, టీ.బీ.జె.ఎ జిల్లా కోశాధికారి శ్రీధర్, సంయుక్త కార్యదర్శి కుంభం రవికుమార్,నగర అధ్యక్షులు ఎలుగోటి వెంకట్, నగర ఉపాధ్యక్షులు షేక్ సొందుమియా, కార్యదర్శి నాయిని స్వాతి, సహాయ కార్యదర్శి చిన్నంశెట్టి రాంబాబు, ప్రెస్ క్లబ్‌ ఉపాధ్యక్షులు గౌరవరపు జగదీష్, దునక శ్రీను, ప్రసాద రావు, సహాయ కార్యదర్శి కరాటే వేణు, మొగలి నాగేశ్వరరావు, తానంగి బిక్షం, ఈ.సి రాంబాబు,పాగాయోనా మరియు ఫెడరేషన్ నాయకులు సుదగాని కరుణాకర్, కుమార్, కప్పల మధు, కళ్లేపల్లి లింగయ్య, నలమాస్ మహేష్, కె.నాగకృష్ణ, వి.నరేష్, పి.సంతోష్ కుమార్, టి.రామక్రిష్ణ, కె.నాగరాజు, సి.హెచ్.పూర్ణ చందర్, అల్లావుద్దీన్, మధు.బంక, ఎల్.రామ్మూర్తి, జ్యోతి తదితరులుపాల్గొని వేడుకలకు మరింత వైభవం చేకూర్చారు. గణతంత్ర దినోత్సవాన్ని ఐక్యత, దేశభక్తి భావంతో జరుపుకోవాలని పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు.

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *