ప్రాంతీయం

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

44 Views

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య

సిద్దిపేట జిల్లా డిసెంబర్ 20

సిద్దిపేట రూరల్ ఎస్సై అపూర్వ  తెలిపిన వివరాల మేరకు పెద్ద లింగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొమ్మరాజుల కనకయ్య సన్నాఫ్ ఎల్లయ్య ఏజ్ 48 వృత్తి కూలీ అనే వ్యక్తి ఐదు సంవత్సరాల క్రితం ఇల్లు కట్టి తన ఇరువురి బిడ్డల వివాహం చేసినాడు. అట్టి సమయంలో అతనికి దాదాపు 15 లక్షల అప్పు అయినది. ఇట్టి అప్పులు తీర్చడానికి అతను తన ట్రాక్టర్ మరియు ఇల్లు పై లోన్ తీసుకున్నాడు. అయినప్పటికీ తన అప్పులు తీరలేదు. అయితే అప్పుల బాధతో తేదీ 19.12.24 రోజున సాయంత్రం 6 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. అదే గ్రామానికి చెందిన లింగాల జైపాల్  మామిడి తోటలో మామిడి చెట్టుకు ఉరివేసుకొని చనిపోయి ఉన్నాడు.. మృతుడి కొడుకు కొమరాజుల కిషన్, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనైనది

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్