ప్రాంతీయం

శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్‌లో ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు..

15 Views

శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్‌లో ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన సదస్సు

సిద్దిపేట్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట పట్టణ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చేపట్టిన ‘అరైవ్-అలైవ్’ భద్రతా కార్యక్రమంలో భాగంగా, శుక్రవారం స్థానిక శ్రీ చైతన్య రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ట్రాఫిక్ ఎస్.ఐ. విజయ్ భాస్కర్, ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ. విజయ్ భాస్కర్, ప్రసంగిస్తూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు గుర్తులను పాటించడం వల్ల ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. 18 ఏళ్లలోపు పిల్లలు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, దీనివల్ల ప్రాణాపాయం కలగడమే కాకుండా, తల్లిదండ్రులకు భారీ జరిమానాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవడం తప్పనిసరని సూచించారు. విద్యార్థులు చిన్నతనం నుండే రోడ్డు భద్రతా నియమాలను అలవర్చుకోవాలి. మీ ఉజ్వల భవిష్యత్తు కోసం మైనర్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలని ట్రాఫిక్ ఎస్.ఐ విజయ్ భాస్కర్ కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *