కుకునూరుపల్లి,కొమురవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నాలుగు బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కు పాదం..
-నలుగురు నిందితులపై కేసు నమోదు
సిద్దిపేట్, మార్చి 27, తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలపై ప్రత్యేక బృందాలు నిర్వహించిన తనిఖీల్లో కుకునూరుపల్లి కొమురవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహిస్తున్న నాలుగు బెల్ట్ షాపులను పట్టుకొని నలుగురు నిందితులపై కేసు నమోదుచేయడమైనది.కుకునూరుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి మంగోల్ గ్రామంలో నిర్వహించిన తనిఖీల్లో రెండు బెల్ట్ షాపులను గుర్తించి, అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులు 1.ముష్ణం సురేష్(32) తండ్రి: బాలమల్లు, ముష్ణం 2.నరసింహులు ( 32 సం)తండ్రి: బాలమల్లు కేసు నమోదు చేయడం జరిగింది. కొమురవెల్లి పోలీస్ స్టేషన్ పరిధి: గురువన్నపేట గ్రామంలోని రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి ఇద్దరు వ్యక్తులైన 1.బుడిగె రాములు (తండ్రి: బాలయ్య, 60 సం), 2.బ్రాహ్మణపల్లి కనకయ్య (తండ్రి: రామయ్య, 55 సం), కేసు నమోదు చేయడం జరిగింది.ఎక్సైజ్ శాఖతో సమన్వయం చేసుకుంటూ జిల్లాలో బెల్ట్ షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. అక్రమంగా మద్యం విక్రయించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.యువత మద్యం మహమ్మారికి బానిస కాకుండా తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ, వారిని సరైన మార్గంలో నడిపించాలని కోరారు. గ్రామాల్లో ప్రజలు మద్యానికి బానిసలు అవ్వకుండా చూడటంలో గ్రామ పెద్దలు చొరవ తీసుకోవాలని సూచించారు.సిద్ధిపేట పోలీసులు కేవలం నేర నియంత్రణకే పరిమితం కాకుండా, యువత ఉజ్వల భవిష్యత్తు కోసం “సిద్ధిపేట పోలీస్ ఉద్యోగ మిత్ర- మెగా జాబ్ మేళా” అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారనీ, ఇందులో భాగంగా ఇప్పటి వరకు 100 కంపెనీలు ముందుకు వచ్చాయని , ఈ అవకాశాన్ని యువత ఉపయోగించుకోవాలని సూచించారు. త్వరలో జరగనున్న ఆర్మీ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా ఫిజికల్ ఈవెంట్స్ ట్రైనింగ్ (శారీరక దారుఢ్య శిక్షణ) నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సీపీ తెలిపారు.యువత వ్యసనాలకు దూరంగా ఉండి, పోలీస్ శాఖ కల్పిస్తున్న ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని గౌరవప్రదమైన ఉద్యోగాల్లో స్థిరపడాలని పిలుపునిచ్చారు.చట్టవిరుద్ధమైన పనులకు పాల్పడితే వదిలిపెట్టబోమని, ప్రజలు మరియు యువత సిద్ధిపేట పోలీసులకు సహకరించాలని కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపిఎస్ కోరారు..





