
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు: డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి కి వెళ్తున్న డివైఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్ ని వేకువ జామున పోలీసులు అరెస్టు చేసి ఎల్లారెడ్డిపేట స్టేషన్ కు తరలించారని,అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని మహేష్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని యూత్ డిక్లరేషన్ హామీలు అమలు చేయాలని,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 4000 బడ్జెట్లో కేటాయించాలని,జాబ్ క్యాలెండర్ ను అమలు చేయాలని,ఉద్యోగాల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని,రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలుచేయాలని, క్రీడారంగానికి 1000 కోట్ల నిధులు విడుదల చేసి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేయాలని,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఎన్నికల ముందు అధికారంలో రావటం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక యువతని పూర్తిగా మర్చిపోయిందని రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పై మండి పడ్డారు.అనేకమంది యువత ఉన్నత చదువులు చదువుకొని నిరుద్యోగులుగానె మిగిలి పోయారని అవేదన వ్యక్తం చేశారు.ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేక,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కోసం ఎదురుచూస్తూ నిరుద్యోగులుగానే నేటి యువత మిగిలిపోతున్నారని అన్నారు.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం యువతని నిరుద్యోగులని ఆదుకోవాలని నోటిఫికేషన్ లు విడుదల చేయాలని, బడ్జెట్ లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.





