ప్రాంతీయం

డ్రైవింగ్ చేసేవారు నిబంధనలు పాటించాలి…

80 Views

ముస్తాబాద్, మార్చ్ 25 (24/7న్యూస్ ప్రతినిధి): ముస్తాబాద్ మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ సమీపంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం అధికారులు అమలు చేస్తున్న కార్యక్రమంలో ఏస్ఐ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో

ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని పై అధికారుల సూచన మేరకు పోలీస్ సిబ్బందితో అవగాహన సదస్సు ఏర్పాటు చేశామన్నారు. అనంతరం మేజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేవారు డ్రైవింగ్ లైసెన్స్ హెల్మెట్, సీటుబెల్టు తప్పనిసరి వాడాలన్నారు. నిబంధనలు ఉల్లంఘించి రాష్ డ్రైవింగ్‌ కారణాలవల్ల రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే కుటుంబాలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది రహదారులపై ప్రయాణించే ప్రతిఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీసులు, పార్టీలకతీతంగా పలు నాయకులు, ప్రజలు, వాహనదారులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *