సెస్ ప్రచారాన్ని ప్రారంభించిన వైస్ ఎంపీపీ కదిరి భాస్కర్
ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ గా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న తెలంగాణ ఉద్యమకారుడు వైస్ ఎంపీపీ కదిరే భాస్కర్ గౌడ్ మండలంలోని రాజన్నపేట గ్రామంలో ప్రచారాన్ని ప్రారంభించారు.. తనను గెలిపిస్తే ఎల్లవేళలా అందుబాటులో ఉండి విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రైతులతో మాట్లాడారు.. తెలంగాణ ఉద్యమకారుడుగా ప్రజలందరూ తనను గుర్తించి సెస్ ఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు.. రాజన్నపేట గ్రామంలో పలువురు రైతులతో చర్చించిన అనంతరం ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను ప్రజలందరూ ఆశీర్వదించి సెస్ డైరెక్టర్గా ఎన్నుకోవాలని విజ్ఞప్తి చేశారు.. ఈ ప్రచార కార్యక్రమంలో సర్పంచ్ ముక్క శంకర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు




