రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం వెంకట్రావు పేట గ్రామంలో బహుజన సమాజ్ పార్టీ మండల్ అధ్యక్షులు కుమ్మరి దేవదాస్ ఆధ్వర్యంలో మాన్యవర్ కాన్షిరామ్ 17వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కలలుగన్న బహుజన రాజ్యాధికారాన్ని సహకారం చేసిన సామాజిక వైతాళికనిగా పేర్కొనడం జరిగింది.అలాగే భారత దేశ జనాభాలో 90% ఉన్నటువంటి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారాన్ని దూరం చేస్తూ కేవలం 10% ఉన్నటువంటి అగ్రకుల పాలకుల ఎత్తుగడలను పటా పంచలు చేస్తూ జనాభాలో మేమెంతో మా వాటా అంత అనే నినాదంతో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు సైకిల్ పై తిరుగుతూ అట్టడుగు వర్గాల ప్రజలను చైతన్యం చేస్తూ ఉత్తరప్రదేశ్ లో బహుజన సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలో కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చినప్పుడు ఆయనకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని పేర్కొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బుట్టి ఇమ్మానియేల్ కుమ్మరి విజయ్ కుమ్మరి నవీన్ శేఖర్ కిషోర్ జాన్ తిరుపతి నర్సయ్య ఇంకా తదితరులు పాల్గొనడం జరిగింది.




