రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం నిమ్మపెళ్లి గ్రామంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిరసన కార్యక్రమం నిర్వహించారు. నిన్నటి రోజున కోనరావుపేట బస్టాండ్ లో విద్యార్థులకు బస్సు ఆపకుండా విద్యార్థులను ఇబ్బందులు పడుతూ విద్యార్థులకు బస్సులు సమయానికి రాక ఇబ్బందులు పడుతున్నారని అదేవిధంగా మోడల్ స్కూల్ విద్యార్థులకు సమయానికి బస్సులు వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూజం కార్తీక్ డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ విద్యార్థులకు సహకరించాలని తెలిపారు. అదేవిధంగా ప్రొద్దున 8:30 నిమిషాలకు మరియు సాయంత్రం 5;00 గంటలకి విద్యార్థులకు అనుకూలంగా బస్సులు నడపాలని హెచ్చరిస్తున్నాం లేని పక్షంలో కోనరావుపేట మండలంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు తీస్తామని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూజం కార్తీక్ అన్నాడు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పూజం కార్తీక్, చిలుక వినయ్, నంద్యాల యశ్వంత్, కడారి యశ్వంత్, పూజం చందు, మ్యాధరి శివ, విద్యార్థులు,తదితరులు పాల్గొన్నారు.
