ప్రాంతీయం

దండేపల్లి పోలీస్‌ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా

23 Views

*రామగుండం పోలీస్ కమీషనరేట్*

*దండేపల్లి పోలీస్‌ స్టేషన్ సందర్శించిన పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా*

మంచిర్యాల జిల్లా.

రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్ తో కలిసి సాయంత్రం దండేపల్లి పోలీస్‌ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ స్టేషన్‌ పరిసరాలను పరిశీలిమచడంతో పాటు, స్టేషన్‌ భౌగోళిక పరిస్థితులు, సిబ్బంది పనీతీరు, స్టేషన్‌ పరిధిలో అధికంగా నమోదయ్యే కేసుల వివరాలతో పాటు, గ్రామాల వివరాలను పోలీస్‌ కమిషనర్‌ సంబంధిత స్టేషన్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్ సిబ్బందితో మాట్లాడి సిబ్బంది కి ఏదైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకొని, పోలీస్ స్టేషన్ రికార్డ్ లను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పెండింగ్ కేసులపై సీపీ ఆరా తీయడంతో పాటు నేరాల నియంత్రణ కు తీసుకుంటున్న చర్యలను ఎస్ ఐ తైసినోద్దీన్ ని అడిగి తెలుసుకొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించాలని, మారుమూల ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *