ప్రాంతీయం

కనీస వేతనాలు ఇవ్వాలి 

78 Views

మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలి

మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి

చొప్పరి రవికుమార్ డిమాండ్.

సిద్దిపేట జిల్లా జూన్ 6

సిద్దిపేట జిల్లా చేర్యాల టౌన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరి గా వర్కర్ కి 15,600, డ్రైవర్స్ కి 19000, బిల్ కలెక్టర్ కంప్యూటర్ ఆపరేటర్లకి 21 750 రూపాయలు చెల్లించాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చొప్పరి రవికుమార్ డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికులకు వేతనాల విషయమై మున్సిపల్ మేనేజర్ ప్రభాకర్ కి డిమాండ్లతో కూడిన వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రాష్ట్రమంతటా మున్సిపాలిటీలో పనిచేస్తున్న కార్మికులకి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు కేటగిరి గా వర్కర్ కి 15600, డ్రైవర్స్ కి 19000, బిల్ కలెక్టర్ కంప్యూటర్ ఆపరేటర్ లకు 21750 రూపాయలు చెల్లిస్తున్నప్పటికీ గత రెండు సంవత్సరాల కాలం నుండి చేర్యాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న మున్సిపల్ సిబ్బందికి వేతనాలు కోత వేధిస్తూ కేవలం 12 000/- రూపాయలు మాత్రమే ఇవ్వడం దుర్మార్గమైన చర్య అని మున్సిపల్ కార్మికులు ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు దాదాపు 12 గంటలు పని చేస్తున్నప్పటికీ కనీస వేతనాలు ఇవ్వకపోగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి వేతనాలు కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటని వెంటనే చేర్యాల మున్సిపాలిటీ లో పనిచేస్తున్న కార్మికులకి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఇప్పకాయల శోభ, వ్యవసాయ కార్మిక సంఘం చేర్యాల పట్టణ కార్యదర్శి బోయిని మల్లేశం, పాక శీను, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్