ప్రాంతీయం

కనుమరుగైపోతున్న కళకు జీవం పోస్తున్న కళాకారులు…

406 Views

ముస్తాబాద్, మార్చి 19 (24/7న్యూస్ ప్రతినిధి): నిజంగానే కళ తప్పుతోంది! ఇంకెప్పుడు పల్లెల్లో రోజుల తరబడి నాటకాలు వేస్తూ వీధివీధిన తిరిగి పాటలు పాడుతూ కాళ్లకు గజ్జలుకట్టి పాటలుపాడి జనాన్ని రంజింపజేసిన కళాకారులు నేటి ఆధునిక పోకడలతో కాలక్రమేణా కనుమరుగవుతున్నారు. ఆటనువీడి పాటను మాని.. కన్నీటి అంచున కాలం వెల్లదీస్తున్నారు. ఓవైపు చేతిలో చిల్లిగవ్వలేక మరోవైపు స్వరాష్ట్రంలో సర్కారు ప్రోత్సాహంలేక అర్ధాకలితో విలవిల్లాడుతున్నారు. ఆ మరుపురాని నాటి కళను పురస్కరించుకొని నేడు మండలంలోని గూడెం గ్రామంలో ప్రతిఏటా ఉగాది రోజున ఆనవాయితీగా వస్తున్న వేషాధారణతో తబలా తాలాలతో పాటలు పాడుతూ నృత్యంచేశారు. స్థానికంగా ఉన్న కళాకారుడు మాట్లాడుతూ నాటి కలలు కళతప్పి కనుమరువైనప్పటికీ మరవకున్నాము పూర్వ వైభవం సజీవంగా ఉందని గర్వపడుతున్నామన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *