ప్రాంతీయం

షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు

21 Views

షెడ్యూల్డ్ కులముల నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు

జిల్లా షెడ్యూల్డ్ కలముల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్

మంచిర్యాల జిల్లా ,మార్చి 18, 2026:
జిల్లాలోని షెడ్యూల్ కులమునకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థిక పురోగతి పెంపొందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా షెడ్యూల్డ్ కలముల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యనిర్వాహక సంచాలకులు చాతరాజుల దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. రవాణా రంగం ఎలక్ట్రికల్ లో ఈ.వి. 2 వీలర్ ను 90 శాతం రాయితీ, 10 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 1 లక్ష రూపాయలతో 185 యూనిట్లు, ఈ. వి. త్రిచక్ర వాహనం (సరుకు రవాణా/ప్రయాణికుల రవాణా) ను 70 శాతం రాయితీ, 30 శాతం బ్యాంకు రుణం కలిపించి సగటు యూనిట్ ధర 3 లక్షల రూపాయలతో 91 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ పథకాలలో సోలార్ యూనివర్సల్ పంప్ కంట్రోల్, వ్యవసాయ అనుబంధ భాగం ను 60 శాతం రాయితీ, 40 శాతం బ్యాంకు రుణం కల్పించి సగటు యూనిట్ ధర 3 లక్షల రూపాయల నుండి 7 లక్షల రూపాయల వరకు 19 యూనిట్లు అందించడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డు/ఆహార భద్రత కార్డు, కుల ధ్రువీకరణ పత్రం (తెలంగాణ ఏర్పడిన తర్వాత), ఆదాయ ధ్రువీకరణ పత్రం (మీ సేవ ద్వారా జారీ, వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయలకు లోబడి), వ్యవసాయేతర పథకాలకు అభ్యర్థుల వయసు 21-50 సం.లు, వ్యవసాయ పథకాలకు 21-60 సం.లు ఉండాలని తెలిపారు. శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ (రవాణా రంగ పథకాలకు), షెడ్యూల్డ్ కులాల పారిశ్రామికవేత్తలు/ గిగ్ వర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, పట్టాదారు పాసు పుస్తకం (సోలార్ పంపు సెట్ కోసం కనీసం 2 ఎకరాల భూమి అవసరం), బోరు బావి, నీటి లభ్యతను నిర్ధారిస్తూ గ్రామ కార్యదర్శి నుండి ధ్రువీకరణ పత్రం సమర్పించాలని, సదరం సర్టిఫికెట్ (దివ్యాంగుల కొరకు), పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీ లోగా OBMMS పోర్టల్ లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ లో అప్ లోడ్ చేసిన దరఖాస్తులను డౌన్ లోడ్ చేసుకొని సరైన ధ్రువపత్రాలు జత చేసి జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని మొదటి అంతస్తులో గల ఎఫ్-3ఎ బ్లాక్ లోని జిల్లా షెడ్యూల్డ్ కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *