Breaking News ప్రాంతీయం విద్య

తండ్రి మరణం తో తీవ్ర బావోద్వేగానికి లోనై.. పది పరీక్ష కేంద్రానికి హాజరైన విద్యార్థి…

601 Views

తండ్రి మరణం… తనయుడు పదో తరగతి పరీక్షా కేంద్రానికి హాజరు..

 

పుట్టెడు దుఃఖంలో ఉన్న తండ్రి మరణాన్ని దిగమింగి  విద్యార్థి పదో తరగతి పరీక్ష రాయడానికి వెళ్లిన సంఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఇదే గ్రామానికి చెందిన రాజిరెడ్డి (45) గుండెపోటుతో మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. అతని కుమారుడు అక్షిత్ ప్రైవేట్ పాఠశాల లో  పదో తరగతి చదువుతున్నాడు. అతడికి బుధవారం హిందీ పరీక్ష ఉండడంతో కుటుంబ సభ్యులు నచ్చచెప్పి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల సెంటర్ కు పంపించారు. తీవ్ర భావోద్వేగంతో పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. తీవ్ర విషాద ఛాయలు ఎల్లారెడ్డిపేటలో అలుముకున్నాయి. పరీక్ష ముగియగానే తండ్రి అంత్యక్రియలు జరుపుతారని స్థానిక సమాచారం.

.

← Back

Thank you for your response. ✨

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *