హనుమాన్ మాన్యు సూక్త హోమం నిర్వహించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి.
మంచిర్యాల జిల్లా.
హనుమాన్ దీక్షలో ఉన్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మంచిర్యాల పట్టణం హైటెక్ సిటీ వారి నివాసంలో కుటుంబ సమేతంగా హనుమాన్ మన్యు సూక్త హోమం నిర్వహించడం జరిగింది. వేద పండితులు సంతోష్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ హోమం కార్యక్రమంలో పెద్ద ఎత్తున హనుమాన్ దీక్ష స్వాములు, బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, బీజేపీ నాయకులు మరియు హనుమాన్ భక్తులు పాల్గొన్నారు. హోమం కార్యక్రమం అనంతరం హనుమాన్ దీక్ష స్వాములకు రఘునాథ్ అన్నప్రసాదం వితరణ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా ప్రజలు ఆయురారోగ్యాలులతో సుభిక్షంగా ఉండాలని ఆ శ్రీరాముడి, హనుమంతుని ఆశీస్సులు అందరి పై ఉండాలని వేసుకున్నట్టు తెలిపారు.





