09 వ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ పర్యవేక్షించారు.
మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత,కార్యక్రమ అప్డేట్స్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్.
మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు మంచిర్యాల నగర పాలక సంస్థ మేయర్ దర్నీ మధుకర్ ఆధ్వర్యంలో చేపట్టిన మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత అనే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు స్థానిక 09 వ డివిజన్ లో చేపట్టిన స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ పర్యవేక్షించారు.
ఈ కార్యక్రమం గురించి డివిజన్ ప్రజలతో మాట్లాడి పలు సమస్యలపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు తగిన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు 09 వ డివిజన్ కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య , నస్పూర్ మాజీ మున్సిపల్ ఛైర్మన్ సురిమిల్ల వేణు , మంచిర్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ సళ్ళ మహేష్ , తీగల్పహాడ్ మాజీ సర్పంచ్ తెలేటి క్రీస్టయ్యా ,మున్సిపల్ డివిజనల్ ఆఫీసర్ ,సిబ్బంది మరియు స్థానిక కాంగ్రెస్ నాయకులు ,స్థానిక ప్రజలు,గ్రామస్థులు పాల్గొన్నారు.





