ప్రాంతీయం

25 వేల తక్షణ సాయం ప్రకటించిన మంత్రి, వెంటనే బాధితులకు అందజేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్మోహన్ రావు.

7 Views

*సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం**లారీ–ఆటో ఢీ.. ముగ్గురు మహిళలు మృతి

*మృతుల కుటుంబాలకు వ్యక్తిగతంగా రూ.25 వేల చొప్పున, క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున తక్షణ సాయం ప్రకటించిన మంత్రి, వెంటనే బాధితులకు అందజేసిన మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంతెన జగన్మోహన్ రావు.

*మంచిర్యాల, సెప్టెంబర్ 28:* మంచిర్యాల జిల్లా సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ–ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులను మందమర్రి మండలానికి చెందిన మహిళలుగా గుర్తించారు. కార్మిక మరియు గనుల శాఖ మంత్రి  గడ్డం వివేక్ వెంకటస్వామి ఆదేశాల మేరకు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ తో మాట్లాడి బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి మెరుగైన చికిత్స అందజేయాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.

ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం వ్యక్తిగతంగా అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున ప్రకటించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *