ప్రాంతీయం

గ్రామ సేవకులే అసలైన ప్రగతి చక్రాలు. వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్

20 Views

సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామంలో ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామానికి చాలా కాలంగా సంపాయి సేవలు అందిస్తున్న సంపాయి కార్మికులు వీరాస్వామి, బుధవ్వ, నర్సవ్వలను గ్రామ సర్పంచ్ రాజాగారి రేణుక రాజగౌడ్ ఆధ్వర్యంలో సన్మానించారు. గ్రామ ప్రజలకు పరిశుభ్రత సేవలు అందిస్తూ గ్రామ అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారిని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేణుక రాజగౌడ్ మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రత కోసం సంపాయి కార్మికులు నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు. వారి సేవలను గుర్తించి ప్రోత్సహించడం గ్రామ పంచాయతీ బాధ్యత అని అన్నారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి కృషి ఎంతో ముఖ్యమని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, గ్రామ కార్యదర్శి, వార్డు సభ్యులు, గ్రామ యువకులు, గ్రామస్థులు పాల్గొని సన్మానితులను అభినందించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *