ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా కానుకలు.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా ,మార్చి 15, 2026:
రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ట్రైని డిప్యూటీ కలెక్టర్ మహమ్మద్ విలాయత్ అలీ, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, జిల్లా సంక్షేమ శాఖ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా పౌర సంబంధాల అధికారి కృష్ణమూర్తి, మండల తహసిల్దార్ రఫతుల్లా, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుతో పాటు తోఫా అందిస్తుందని తెలిపారు. నియోజకవర్గానికి 3 లక్షల రూపాయలు అందించడం జరిగిందని, త్వరలో తోఫా కిట్లను అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరూ మత సామరస్యంతో సమాజాభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ముస్లిం మత పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





