ప్రాంతీయం

కవిత్రి మొల్ల జయంతి వేడుకలు…

61 Views

ముస్తాబాద్, మార్చి13 (24/7న్యూస్ ప్రతినిధి):  శాలివాహన యువజన సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతి వేడుకలను మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక ఉపసర్పంచ్ తాళ్ల విజయరెడ్డితో పాటు యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ రానున్న మొల్లమాంబ జయంతిని ప్రభుత్వం అధికారికంగా వేడుకలను జరుపాలని విజ్ఞప్తి చేశారు. కుమ్మరి కులస్థులకు ప్రభుత్వం సబ్సిడీ రుణాలతో పాటు కుండల తయారీకి ఆధునిక పరికరాలను అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలో శాలివాహన కుమ్మరుల తయారు చేసిన వస్తువులను మార్కెట్‌లో విక్రయించేందుకు ప్రత్యేక స్థలాన్ని కేటాయించా లన్నారు. 50ఏళ్లు నిండిన కుమ్మర కుల వృత్తిదారులకు రూ.2 వేల పింఛన్‌ ఇవ్వాలని, బడ్జెట్‌లో కుమ్మరుల సంక్షేమానికి రూ. 100 కోట్లు కేటాయించాలన్నారు. మండలంలో కులసంఘ భవనాలు నిర్మిం చుకునేందుకు ప్రభుత్వ స్థలాలతో పాటు నిధులు కేటాయించాలన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *