Breaking News

ఆసుపత్రి నుండి పది పరీక్షా కేంద్రానికి

412 Views

ఎల్లారెడ్డిపేట మండల పరీక్ష కేంద్రానికి ఆసుపత్రి నుండి నేరుగా పరీక్ష రాయడానికి పదవ తరగతి విద్యార్థి హాజరవ్వడం అందరిని ఆశ్చర్యాన్ని గురిచేసింది. మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి రాజేష్ కు రెండు రోజుల క్రితం అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. మూడవరోజు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ కాగానే నేరుగా తన తల్లితో కలిసి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. అక్కడున్న ఉపాధ్యాయులను ఆ తల్లి తమ కుమారునికి సర్జరీ అయిందని పరీక్ష రాసే సమయంలో కాస్త గమనించాలని వేడుకోవడం ఆ విద్యార్థికి ఆ తల్లికి చదువు పట్ల ఉన్న మమకారం అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉపాధ్యాయులు పోలీసులు ఆ తల్లిని ఓదార్చి మీ అబ్బాయికి ఏమి కాదని మీరు అందుబాటులో ఉండాలని ఏదైనా ఉంటే మేము సమాచారం ఇస్తామని తెలిపి విద్యార్థిని పరీక్షా కేంద్రంలోనికి పంపించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *