ఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం.జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల జిల్లా,మార్చి 8, 2026:
ఆరోగ్యవంతమైన మహిళల ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం రూపొందుతుందని, ఈ క్రమంలో 14 సంవత్సరాల వయసు నుండి 15వ సంవత్సరంలో ఉన్న బాలికలు హెచ్ పి వి వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని కాలేజీ రోడ్డులో గల మాతా శిశు సంరక్షణ కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్లా రమ్య, జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రి సంచాలకులు డాక్టర్ వేదవ్యాస్ అధికారులతో కలిసి హెచ్ పి వి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో 14 సంవత్సరములు నిండిన బాలికలకు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గ్రామాలలో తల్లిదండ్రులకు పాఠశాలలలో ఉపాధ్యాయుల ద్వారా, విద్యాశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా మహిళా సంఘాలకు అవగాహన కల్పించాలని, గర్భాశయ, ముక్కు ద్వారా క్యాన్సర్లను రాకుండా వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని తెలిపారు. వ్యాక్సిన్ తీసుకోవడం వలన ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ముందస్తు చర్యలలో భాగంగా ఈ వ్యాక్సిన్ పిల్లలకు ఇవ్వడం వలన రేపటి తరాలు బాగుంటాయని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించడం జరిగినదని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆరోగ్య, ఆశ కార్యకర్తలను భాగస్వామ్యులను చేయడం జరుగుతుందని, జిల్లాలో 8 వేల 150 మంది పిల్లలకు వ్యాక్సిన్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగినదని, జిల్లాలోని మంచిర్యాల పట్టణంలో గల మాతా శిశు ఆసుపత్రి, బెల్లంపల్లి, లక్షెట్టిపేట్, చెన్నూర్ లలో గల సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా వ్యాక్సిన్ అందించడం జరుగుతుందని తెలిపారు. నస్పూర్ లోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, జిల్లా మైనారిటీ సంక్షేమ బాలికల పాఠశాల విద్యార్థులు 30 మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమం పూర్తి చేయడం జరిగిందని, విద్యార్థుల వివరాలు క్లబ్ చేయడం జరిగిందని తెలిపారు. అనంతరం కార్యక్రమం సంబంధిత గూడ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమం సంబంధిత గోడ ప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు బాలాజీ, ఆర్ ఎం ఓ లు భీష్మ, శ్రీధర్, డిపిఓ ప్రశాంతి, ఆర్ఎస్ పద్మ, అల్లాడి శ్రీనివాస్, కాకిరాల వెంకటేశ్వర్లు, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్లు, స్థానిక కార్పొరేటర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





