ప్రాంతీయం

మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ తక్షణ స్పందన

20 Views

మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ తక్షణ స్పందన.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని CCC లో గల మున్సిపల్ కార్పొరేషన్ డంప్ యార్డ్ లో వేసవి కాలం తీవ్రత వలన తీవ్రమైన మంటలు చెలరేగాయి.

స్థానిక కార్పొరేటర్,మరియు ప్రజలు మేయర్ కి సమాచారం ఇవ్వడం తో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న మేయర్ దర్ని మధుకర్ మంచిర్యాల ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం ఇచ్చి ఫైర్ ఇంజన్ ను పిలిపించి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చేవరకు అక్కడే ఉండి పరిస్థితులను సమీక్షించారు.

వేసవి కాలం లో మంటలు చెలరేగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందిని ఆదేశించారు.సత్వరమే సంఘటనపై స్పందించిన మేయర్ ని స్థానిక ప్రజలు అభినందించారు. సంఘటన స్థలాన్ని మేయర్ తో స్థానిక కార్పొరేటర్ పుట్ట యశోద, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు,సిబ్బంది పరిశీలించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *