ప్రాంతీయం

ఘనంగా 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

36 Views

ఘనంగా 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

ఖమ్మం రూరల్,మార్చి 08

ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10 వ తరగతి చదువుతున్న విద్యార్థుల వీడ్కోలు సమావేశం ప్రధానోపాధ్యాయులు ఆమంచి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ రూరల్ మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి జగదీష్,సర్పంచ్ బండి సతీష్,ఉప సర్పంచ్ షేక్ దావూద్,మాజీ ఏఏపిసి చైర్మన్ పప్పుల విజయ,మాజీ ఎస్ ఎం సి చైర్మన్ పప్పుల రమణ,మాజీ జెడ్పీటీసీ పెరుమాళ్లపల్లి మోహనరావు లు మాట్లాడుతూ.విద్యార్థులకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలు ప్రతి సంవత్సరం కల్పిస్తున్నామని,గత ఏడాది 10వ తరగతి లో 100శాతం ఉత్తీర్ణత సాధించామని వారందరికీ ఇచ్చిన మాట ప్రకారం ప్రోత్సాహకాలను,నగదు బహుమతులను అందజేశామని, ఈ సంవత్సరం కూడా మంచిగా చదువుకొని గ్రామానికి,గురువులకు,తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పప్పుల రమాదేవి రిటైర్డ్ ఉద్యోగి ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్ లు ,పెన్నులు అందించారు.గతేడాది ఉత్తీర్ణత సాధించిన మొదటి,రెండవ,మూడవ స్థానంలోని విద్యార్థులకు మాజీ జెడ్పీటీసీ మోహనరావు 3వేల 500 నగదును అందజేశారు.2వ వార్డు సభ్యులు తంగెళ్లపల్లి నారాయణమ్మ విద్యార్థులకు కంపాస్ బాక్స్, స్కేల్స్,పెన్సిల్స్ అందజేశారు. అలాగే కొత్తగా ఎన్నికైన ఏఏ పిసి చైర్మన్ రమాదేవి కి స్వాగతం పలుకుతూ మాజీ చైర్మన్ విజయకు వీడ్కోలు సన్మానం చేసిన అనంతరం విద్యార్ధుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు నాగులమీరా,సీనియర్ జర్నలిస్ట్ వేణుగోపాల్,రిటైర్డ్ ఆర్.ఐ. కనకయ్య,ఉపాధ్యాయులు సతీష్,పార్వతి,కమల,వార్డు సభ్యులు కందుల భాస్కర్,గుండె తిరపయ్య, మోత్కురిలక్ష్మయ్య,విద్యార్ధిని,విద్యార్ధులు,ఆఫిస్ సబార్డినేట్ రఫీ మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.

← Back

Thank you for your response. ✨

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *