ప్రాంతీయం

అమెరికా ఎఫ్‌డిఏ ప్రమాణాలతో ‘గ్రావిటీ’ ఔషధాలు

19 Views

అమెరికా ఎఫ్‌డిఏ ప్రమాణాలతో ‘గ్రావిటీ’ ఔషధాలు

— ప్రపంచస్థాయి నమ్మకాన్ని చూరగొంటున్న గ్రావిటీ ఫార్మా

— ఏడాదికి 1000 కోట్ల టాబ్లెట్లు తయారీ, నిపుణుల బృందంతో ముందంజ

ఖమ్మం, మార్చి 8: అమెరికా ఎఫ్‌డిఏ ప్రమాణాలతో నాణ్యమైన ఔషధాలను తయారు చేస్తున్న గ్రావిటీ ఫార్మా సంస్థ అంతర్జాతీయ స్థాయిలో విశ్వసనీయతను సంపాదించుకుంటోంది. 2014లో హైదరాబాద్ పాషి మైలారంలో తయారై అమెరికాలో వ్యాపారం ప్రారంభమైన ఈ సంస్థ ప్రపంచ ఫార్మా రంగంలో ప్రముఖ స్థానాన్ని దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. అమెరికాలోని ప్రముఖ ఔషధ తయారీ సంస్థలలో టాప్ సంస్థల సరసన నిలుస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. అమెరికా ఎఫ్‌డిఏ ప్రమాణాలకు అనుగుణంగా ఇండియాలో తయారయ్యే ఈ గ్రావిటీ ఔషధాలు అమెరికాలోని ప్రముఖ ఫార్మసీ చైన్‌లైన వాల్‌గ్రీన్స్, వాల్‌మార్ట్, సీవీఎస్ వంటి స్టోర్లలో అందుబాటులో ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎఫ్‌డిఏ ఆడిట్‌లో సంస్థ ఎలాంటి లోపాలు లేకుండా ఉత్తీర్ణత సాధించడం ద్వారా తన నాణ్యతా ప్రమాణాలను మరోసారి నిరూపించుకుంది. ఇండియాలో 2025 జనవరిలో వ్యాపార కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికే లక్షకు పైగా డాక్టర్ల విశ్వాసాన్ని పొందింది. గ్రావిటీ ఫార్మా తొలి వార్షికోత్సవ వేడుకలు వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో ఘనంగా నిర్వహించారు. సుమారు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఆధునిక తయారీ కేంద్రంలో సంవత్సరానికి సుమారు 1000 కోట్ల టాబ్లెట్లు తయారవుతున్నాయి. సంస్థలో 300 మంది పీహెచ్‌డీ నిపుణులు, 500 మంది ఎం.ఫార్మసీ ప్రొఫెషనల్స్‌తో కూడిన ప్రత్యేక బృందం పనిచేస్తోంది. ఆధునిక పరిశోధన, నాణ్యతా ప్రమాణాలతో సంస్థ ఔషధ రంగంలో ముందంజలో నిలుస్తోంది.కార్డియాక్ హెల్త్, డయాబెటిస్ నియంత్రణ, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆరోగ్యం, సాధారణ ఆరోగ్యం వంటి విభాగాల్లో గ్రావిటీ పలు ఔషధాలను అందిస్తోంది. అత్యాధునిక సాంకేతికతతో నిపుణుల బృందం పనిచేస్తూ సంస్థను అంతర్జాతీయ మార్కెట్‌లో మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తోంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ధీరజ్ గోరుకంటి నాయకత్వంలో సీఓఓ తిలక్, ఇండియా బిజినెస్ జీఎంలు నరేష్, వినోద్, కృష్ణ కిశోర్, న్యూరో విభాగం జీఎం నరేందర్ సహకారంతో సంస్థ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. ఈ కార్యక్రమంలో ఖమ్మం న్యూరో సొసైటీ జనరల్ సెక్రటరీ ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కె. జగదీష్ బాబు, అధ్యక్షులు డాక్టర్ పి. అసాధారన్, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ జి.వి. మురళి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *