ప్రాంతీయం

నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కమిషనర్ రష్మీ  పెరుమాళ్,

38 Views

నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన..

కమిషనర్ రష్మీ  పెరుమాళ్,

సిద్దిపేట జిల్లా, జనవరి 30, తెలుగు న్యూస్ 24/7

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేలా చూడటంలో భాగంగా సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ నేడు దుబ్బక మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించి, ఎన్నికల అధికారులతో చర్చించారు.నామినేషన్ల కేంద్రం వద్ద మున్సిపల్ కార్యాలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తును కమిషనర్ తనిఖీ చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని తెలియజేశారు .ఈ పర్యటనలో స్థానిక సిద్దిపేట ఏసీపీ రవీందర్ , దుబ్బాక సీఐ రాజేష్ , దుబ్బాక ఎస్సై కీర్తి రాజు  ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *