ప్రాంతీయం

ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.80 లక్షలు కేటాయించి మూడు బస్సులను ఏర్పాటు చేసిన ఎంపి గడ్డం వంశీకృష్ణ

8 Views

ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.80 లక్షలు కేటాయించి మూడు బస్సులను ఏర్పాటు చేసిన ఎంపి గడ్డం వంశీకృష్ణ.

మంచిర్యాల జిల్లా:

మంచిర్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీ విద్యార్థుల రవాణా సమస్యలను దృష్టిలో ఉంచుకొని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ  ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.80 లక్షలు మంజూరు చేసి మూడు బస్సులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్  పాల్గొన్నారు.

గతంలో మెడికల్ కాలేజీని సందర్శించిన సమయంలో విద్యార్థులు హాస్టల్‌కు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నామని ఎంపీ వంశీ కృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఎంపీ వంశీ కృష్ణ ఎంపీ లాడ్స్ నిధుల నుండి రూ.80 లక్షలు కేటాయించి మూడు బస్సులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌కు సూచించారు.

ఈ సందర్భంగా ఎంపీ వంశీ కృష్ణ మాట్లాడుతూ గతంలో కాలేజీకి వచ్చినప్పుడు విద్యార్థులు హాస్టల్‌కు వెళ్లడానికి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదని చెప్పారని, ఆ సమస్యను పరిష్కరించేందుకు రూ.80 లక్షల నిధులతో మూడు బస్సులను అందజేశామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచిర్యాల జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందని, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉందని పేర్కొన్నారు. “విద్య మన హక్కు… విద్యతోనే మన భవిష్యత్” అని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు, మెడికల్ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *