ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు పై కార్యక్రమం

17 Views

మంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు పై కార్యక్రమం.

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల జిల్లాలో ప్రజా పాలన పట్టణ ప్రణాళిక మరియు 100 రోజులపాటు హెల్త్ మిషిన్ ఆరోగ్య సేవలు అందించడంలో భాగంగా ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత  ఈరోజు జిల్లాలోని ప్రోగ్రామ్ ఆఫీసర్లు వైద్యాధికారులు బస్తీధవకానాలు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ల వైద్యులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖలోని కార్యక్రమాలను చూసి అధికారులతో ఈ జూమ్ మీటింగ్ ద్వారా అందరికీ సంసిద్ధత చేయడం జరిగినది మార్చ్ ఆరవ తేదీ నుండి జూన్ 12వ వరకు 99 రోజులపాటు ప్రజాపాలన పట్టణ ప్రణాళిక ఆరోగ్య మిషిన్ కార్యక్రమంలో చేయవలసిన కార్యక్రమాల పైన అవగాహన కలిగించడం సంసిద్ధత చేయడం జరిగినది ముఖ్యంగా మాతా శిశు సంరక్షణ టీకాల కార్యక్రమము అసంక్రమణ వ్యాధులు వాటిని గుర్తించడం నమోదు చేయడము అవగాహన కలిగించడము అదేవిధంగా సంక్రమణ వ్యాధులు వాటి నివారణలో తీసుకోవలసిన జాగ్రత్తలు కీటక జనిత వ్యాధులైన మలేరియా డెంగ్యూ చికెన్ గుని అలాంటివి ప్రభలకుంట తీసుకోవలసిన జాగ్రత్తలు గ్రామపంచాయతీ మున్సిపల్ సహకారంతో చేయవలసిన విధులు పరిసరాల పరిశుభ్రత వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టడం మరియు అయోవృద్ధులకు పరీక్షలు 30 సంవత్సరముల పైబడిన వారందరికీ అసంక్రమణ వ్యాధుల పైన పరీక్షలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళా గ్రూపులతో డిజిటల్ ఆరోగ్య కార్డులను నమోదు చేయడము వారికి పరీక్షలు చేయించడము ముఖ్యంగా ఎనీమియా అసంక్రమణ వ్యాధులు జీవనశైలిలో వచ్చే మార్పులకు సంబంధించిన వ్యాధులు గుర్తింపు వివరములు నమోదు చేయడము ఉచితంగా పరీక్షలు చేయించడం కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా మాతా శిశు సంరక్షణ తల్లులందరికీ ఎనిమియా పరీక్షలు టీకాల కార్యక్రమము ఆరోగ్య మహిళా కార్యక్రమాలు 60 సంవత్సరములు పైబడిన వారు అందరికీ పరీక్షలు డయాబెటిస్ బిపి క్యాన్సర్లను గుర్తించడం స్క్రీనింగ్ క్యాంపులను కండక్ట్ చేయడము, టిబి ముక్తి నివారణ కార్యక్రమంలో భాగంగా వ్యాధిగ్రస్తులను గుర్తించడము మందులు అందజేయడం పోషకార కిట్లను అందజేయడం హెచ్ఐవి స్క్రీనింగ్ చేయడము మరియు ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేయడము అవగాహన కలిగించడము గ్రామాలలో టిఆర్ఎస్ అందుబాటులో ఉంచడం అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లను జాతీయ క్వాలిటీ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా వచ్చే విధంగా చర్యలు చేపట్టడం ముఖ్యంగా ఈ ఈ వంద రోజులలో వచ్చే జాతీయ కార్యక్రమాలను అన్నిటిని జరుపుకొనుటము వాటికి సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయడం చేయాలని ప్రిపరేషన్ చేయడం జరిగినది ముఖ్యంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా ముఖ్యంగా స్త్రీ సంబంధం చిన్నపిల్లలు ఆర్థోపెడిక్ జనరల్ మెడిసిన్స్ ఆప్తాల మజి డెంటల్ మొదలైన స్పెషలిస్ట్ వైద్యులచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రములలో పరీక్షలు అవగాహన మందులు అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాలోని ఎనిమిది ఆర్బీఎస్కే బృందాల ద్వారా ఆ హాస్టల్లో రెసిడెన్షియల్ హాస్టల్లో పాఠశాలల్లో పరీక్షలు చేయడము సామాజిక ఆరోగ్య కేంద్రంలో నుండి స్పెషలిస్ట్ వైద్యుల ద్వారా పరీక్షలు చేయించడం జరుగుతుంది. ముఖ్యంగా వైద్యాధికారులు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులను సర్పంచులను సమన్వయం చేసుకుంటూ ప్రతి కార్యక్రమంలో పిలవడం చేయాలని ఆదేశించినారు అదేవిధంగా స్థానిక ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు వైద్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో స్థానిక మహిళా గ్రూపుల సమన్వయంతో డిఆర్డిఏ ఐసిడిఎస్ ఇతర డిపార్ట్మెంటులో సహకారంతో కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించినారు ఈ కార్యక్రమంలో వైద్యులు అందుబాటులో ఉంటూ సమయపాలన పాటిస్తూ రోజువారీగా వివరములను తెలుసుకుంటూ చేసిన వివరములను తెలియజేయాలని ఆదేశించినారు.

ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ సుధాకర్ నాయక్ డాక్టర్ ప్రసాద్ డాక్టర్ అరుణ శ్రీ డాక్టర్ అనిల్ మరియు డిపిఓ ప్రశాంతి సిహెచ్ఓ నాందేవ్, డిడిఎం భాగ్య ప్రవళిక సుమన్ ఎస్ఓ కాంతారావు డి పి హెచ్ ఎన్ ఆర్ ఎస్ పద్మ మార్తా వసుమతి జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ముందుండాలని ఆదేశించినారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *