ప్రాంతీయం

డీఎన్‌టీఎఫ్‌ఎన్‌టీ జాబితాలో పూసల కులం చేర్పు చారిత్రాత్మక నిర్ణయం.

25 Views

పూసల కులాన్ని డీఎన్‌టీఎఫ్‌ఎన్‌టీ (డీనోటిఫైడ్ అండ్ నోమాడిక్ ట్రైబ్స్) జాబితాలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిద్దిపేట జిల్లా పూసల సంఘం మాజీ ఉపాధ్యక్షులు ముదరకోళ్ల యాదగిరి స్వాగతించారు. ఈ నిర్ణయం దశాబ్దాలుగా కొనసాగుతున్న సామాజిక గుర్తింపు పోరాటానికి ఫలితమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పూసల వర్గ ప్రజలకు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు మరింత సమర్థవంతంగా అందే అవకాశముందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ, పూసల వర్గ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *