మహోన్నత చరిత్ర కలిగిన ప్రాంతం “గాంధారి ఖిల్లా”
ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్
మార్చి 4, 2026 :
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలోని గాంధారి ఖిల్లాకు మహోన్నత చరిత్ర ఉందని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మాట్ అన్నారు. బుధవారం ఉట్నూర్ ఐ టి డి ఎ ప్రాజెక్టు అధికారి కార్యాలయ చాంబర్ లో ఆదివాసీ నాయకపోడు ప్రతినిధులు కొమ్మ భీమన్న, నాల్నేని రమణ, పుస్తక రచయిత మేసినేని రాజన్న లతో కలిసి గాంధారి ఖిల్లా చరిత్ర భాగం-1 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ పూర్వకాలం ఈ ప్రాంతంలో పాండవులు పర్యటించినట్లు చరిత్ర ఉందని, గిరిజనులు పాండవులను ఆరాధ్య దైవాలుగా కొలుస్తారని తెలిపారు. తెలంగాణలో వనదేవతలను కొలిచే ఆచారం ప్రసిద్ధి పొందిందని, ఈ క్రమంలో గాంధారిఖిల్లా మైసమ్మను దేవతగా కొలుస్తారని తెలిపారు. మహోన్నత చరిత్ర కలిగిన గాంధారి ఖిల్లా ప్రాంత వైభవాన్ని, చరిత్రను భావితరాలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో పుస్తక రచన చేయడం అభినందనీయమని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ సాకేర సర్పంచ్, పుస్తక సహాయ రచయిత దయనేని రమేష్, ఆదివాసి నాయకపోడు సాంస్కృతిక కళ అభివృద్ధి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
*ఉట్నూర్ అదనపు పౌర సంబంధాల అధికారిచే జారీ చేయనైనది*





