ప్రాంతీయం

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

1 Views

విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా.
విద్యార్థుల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శనివారం జిల్లాలోని భీమారం మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి తరగతి గదులు, వంటశాల, విద్యా బోధన తీరు, పరిసరాల పరిశుభ్రత, పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెనూ ప్రకారం సకాలంలో పౌష్టిక ఆహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వం మెనూ ప్రవేశపెట్టి అమలు చేస్తుందని, విద్యారంగ అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యలలో భాగంగా నిష్ణాతులైన ఉపాధ్యాయులను నియమించి విద్యా బోధన అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు అందించే భోజనం తయారీ సమయంలో సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని, తాజా కూరగాయలు, నిత్యావసర  సరుకులను వినియోగించాలని తెలిపారు. వ్యక్తిగత పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని తెలిపారు. 10వ తరగతి వార్షిక పరీక్షల సమీపిస్తున్నందున విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలని, సులభంగా జీర్ణమయ్యే ఆహారం అందించాలని తెలిపారు. పాఠశాలలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థినులు తయారుచేసిన మట్టి ఆకృతులను పరిశీలించారు.

అనంతరం మండలంలోని దాంపూర్ గ్రామంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా ఎంపికైన లబ్ధిదారులు తమ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని తెలిపారు. ఇంటి నిర్మాణ దశలకు అనుగుణంగా బిల్లులు మంజూరు చేయడం జరుగుతుందని, లబ్ధిదారులు తమ ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేసుకోవాలని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కొరకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక అందిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *