రామగుండం పోలీస్ కమిషనరేట్
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా ‘అరైవ్ & అలైవ్’ రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని మందమర్రి చౌరస్తా వద్ద అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి వివేక్ వెంకటస్వామి, మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 13 నుండి 18 వరకు కొనసాగుతున్న ‘అరైవ్ & అలైవ్’ రహదారి భద్రత వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించారు.
ముఖ్య అతిథులు మాట్లాడుతూ రహదారి భద్రతపై అవగాహనతోనే రహదారి ప్రమాదాలను నివారించవచ్చని, ప్రతి వాహనదారుడు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు రహదారి భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. ప్రభుత్వం సురక్షిత ప్రయాణం కోసం రహదారులను నిర్మించినప్పటికీ, వాటిని వినియోగించే వారు క్రమశిక్షణతో, అవగాహనతో వాహనాలు నడపాలని సూచించారు. ఆటో డ్రైవర్లతో పాటు ద్విచక్ర వాహనదారులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు.అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆటో డ్రైవర్లు రహదారి భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. “నేను భారతదేశ పౌరుడిగా మోటారు వాహన చట్టంలోని అన్ని నిబంధనలను పాటిస్తూ, ఇతరులకు అవగాహన కల్పిస్తూ, తోటి రహదారి వినియోగదారులను గౌరవిస్తూ, ప్రమాదాలు జరగకుండా బాధ్యతగా వ్యవహరిస్తాను” అని ప్రమాణం చేశారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ పరస రమేష్, ఎస్ఐ నరేష్, ప్రజాప్రతినిధులు, యువత, ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.





