ప్రాంతీయం

అరుదైన ఆపరేషన్ గర్భాశయ ఫైబ్రైడ్ (లియోమయోమాస్) తొలగింపు

44 Views

అరుదైన ఆపరేషన్ గర్భాశయ ఫైబ్రైడ్ (లియోమయోమాస్) తొలగింపు

-డాక్టర్ అన్నపూర్ణ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్, గజ్వేల్

గజ్వేల్, మార్చి 3, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గజ్వేల్ నందు ఒక అరుదైన గర్భాశయ ఫైబ్రైడ్ (లియోమయోమస్) శస్త్ర చికిత్స నిర్వచనం జరిగింది. 43సంవత్సరములహైదరాబాద్ కు చెందిన ఒక మహిళ కుగర్భాశయo (గర్భసంచి) కండర గోడలలో పెరిగే కణిత టి ఏ హెచ్ పెద్ద గర్భాశయ ఫైబ్రైడ్ 24 వారంలో పరిమాణంలో 13/11/10 సెంటీమీటర్లు కలిగిన ఒక పెద్దఫైబ్రైడలేదాలియోమయోమాస్ అని పిలవబడే అరుదైన ఆపరేషన్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ గజ్వేల్,నందువిజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ శస్త్ర చికిత్సలో డాక్టర్ త్రివేణి, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ ప్రేమ్ కిషోర్, అనస్థీషియా డాక్టర్ మైపాల్, డాక్టర్ సతీష్ కుమార్, నర్సింగ్ ఆఫీసర్స్ సునీత, సునీల్, థియేటర్ అసిస్టెంట్లు సిహెచ్ ,వెంకట్ రాజకుమార్,పి. రాజు. అస్ర, పేషంట్ కేర్, యాదమ్మ ఒక టీం గా ఏర్పడి ఇంత పెద్ద పైబ్రేడ్ ను తొలగించినందుకు చాలాసంతోషంగాఉందన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్నపూర్ణ హాస్పిటల్స్ సూపరింటెండెంట్,మాట్లాడుతూ ఇది మహిళల గర్భాశయంలో కనిపించే అత్యంత అసాధారణమైన కణతి చాలామంది రోగులలో కనిపించవు అయినప్పటికీ 30% మంది అసాధారమైన గర్భాశయ రక్తస్రావము, కడుపులో నొప్పి, రక్తహీనతకు కారణం కావచ్చు, కట్టినొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు, పొత్తికడుపు పూర్తిగా నిండడం వంటి భావన, అత్యవసర మూత్ర విసర్జన, నొప్పితో కూడిన అలసట, అంతర్గత రుతుస్రావము, దిగువ వెన్నునొప్పి, సంతానలేమి, బహుళ గర్భా స్రావాలు, గర్భ దారణలో ఇబ్బందులు కలుగుతాయని డాక్టర్ అన్నపూర్ణ తెలియజేసినారు ఎవరైనా ఈ ఇటువంటి లక్షణాలు ఉంటే మా హాస్పిటల్ ను, సంప్రదించాల్సిందిగా కోరడం జరిగింది. పేషెంట్ కు సంబంధించిన బంధువులు హాస్పిటల్స్ సిబ్బందికి ధన్యవాదాలుతెలియజేయడం జరిగింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *