సిద్దిపేట జిల్లా గోపాలమిత్ర సంఘం ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలు ఓటింగ్ పద్ధతిలో నిర్వహించారు, గోపాలమిత్ర అధ్యక్షుడిగా ఎన్నికైన సింగం రాజు యాదవ్, కార్యదర్శిగా వై యాదగిరి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా సింగం రాజు యాదవ్ మాట్లాడుతూ గోపాలమిత్ర సిద్దిపేట జిల్లా అధ్యక్షుడిగా మరొకసారి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, రైతులకు అండగా ఉంటూ, పాడి పశువుల రైతులకు నిత్యం సేవ చేస్తూ, అందరికీ మేలు చేసే విధంగా కృషి చేస్తామని, అన్నారు ఈ సందర్భంగా గోపాలమిత్ర సంఘం సభ్యులు రైతులు నూతన కార్యవర్గానికి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరీ శంకర్,ఆంజనేయులు,భాస్కర్,శ్రీరాములు, రవి తదితరులు పాల్గొన్నారు.





