ప్రాంతీయం

హోలీ సంబరాల్లో ముస్తాబాద్ సర్పంచ్…

91 Views

ముస్తాబాద్, మార్చి 3 (24/7న్యూస్ ప్రతినిధి): స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సమీపంలో్ని తెలంగాణతల్లి కూడలివద్ద ముస్తాబాద్ సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డితో పాటు స్థానికులు హోలీ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సప్తవర్ణాల శోభితమైన వసంతోత్సవ హోలీ సంబరాలను కాలుష్యరహితంగా నిర్వహించుకోవాలని ముస్తాబాద్ సర్పంచ్ మట్ట వెంకటేశ్వర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనందోత్సాహాలతో జరుపుకునే కనుల విందైన పండుగహోలీ వయసుతో నిమిత్తం లేకుండా అందరూ రంగులు పులుముకుంటూ ఆనందాలతో ఉత్సాహంగా వేడుకలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చింతోజి రాజారాం, మల్లారపు సంతోష్ రెడ్డి, ఏదునూరి గోపికృష్ణ, బద్దిపడిగె ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
కస్తూరి వెంకటరెడ్డి ఆంధ్రప్రభ ముస్తాబాద్ 9618419111

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *