ఎండాకాలంలో కరెంట్ కష్టాలకు ముందస్తూ చెక్
తెలుగు న్యూస్ 24/7
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో ఎండాకాలంలో గ్రామ ప్రజలకు ఎలాంటి విద్యుత్ సమస్యలకు అంతరాయం లేకుండా చూసేందుకుగాను, విద్యుత్ శాఖ పై అధికారుల ఆదేశాల మేరకు విద్యుత్ అధికంగా వాడే అవకాశాలు ఎక్కువగా వాడుతారనే దృష్టిలో ఉంచుకొని విద్యుత్ అధికారులు సింగల్ పేస్ డి టి ఆర్ దగ్గర ఉండే ఎర్థింగ్ కీ గ్రామపంచాయతీ ట్రాక్టర్ తో నీళ్లను పోయడం జరిగింది. ఈ సందర్భంగా గుగ్గిళ్ల గ్రామ జూనియర్ లైన్ మెన్ మేడిపల్లి నరేష్ మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ లా దగ్గర ఏదైనా సమస్యలు ఉంటే విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకొని రావాలని,రాబోయే ఎండాకాలంలో విద్యుత్ కోతలు లేకుండా చూసేందుకు వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు సహాయపడతాయనీ తెలిపారు.ఈ కార్యక్రమంలో జూనియర్ లైన్ మెన్ నరేష్, సబ్ స్టేషన్ ఆపరేటర్ ఆంజనేయులు, గుగ్గిళ్ళ గ్రామపంచాయతీ కారాబార్ కొంకటి అశోక్,పంచాయితీ కార్మికులు శ్రీనివాస్,సుమన్ పాల్గొన్నారు.





