ప్రాంతీయం

మాదిగ అమరవీరులకు ఘన నివాళులు.

43 Views

ములుగు మండల కేంద్రంలోని డా.బి.ఆర్. అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాల వద్ద ములుగు ఎమ్మార్పీఎస్ మండల కమిటీ, గ్రామ కమిటీలు మాదిగ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాయి. మందా కృష్ణ మాదిగ నాయకత్వంలో సాగిన ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమంలో ప్రాణత్యాగం చేసిన మాదిగ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షుడు బుడిగె మహేష్ మాదిగ మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా సాగిన ఉద్యమ ఫలితంగా ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందన్నారు. అమరవీరుల త్యాగాల వల్లే ఈ విజయం సాధ్యమైందని తెలిపారు. సాధించిన హక్కులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఆదాస్ మహేష్, మండల ప్రధాన కార్యదర్శి కొమ్ము వినోద్ కుమార్, మండల ఉపాధ్యక్షులు రమణి మల్లేష్, సీనియర్ నాయకులు తూర్పుంటి రాజు, తోడేటి చంద్రయ్య, కడపల నరసింహారెడ్డి, కుతాడి శ్రీనివాస్, కత్తెర స్వదేశ్, రామగల బాబు, తోడేటి మహేష్, కప్పేరి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *