ప్రాంతీయం

దేవక్కపల్లి లో చెరువు కట్టపై చనిపోయిన కోళ్ల వ్యర్థాలు..

141 Views

దేవక్కపల్లి లో చెరువు కట్టపై చనిపోయిన కోళ్ల వ్యర్థాలు..

-ఇబ్బందుల్లో గ్రామప్రజలు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి, మార్చి 1, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో చెరువు కట్టపై చనిపోయిన కోళ్ల వ్యర్థాలను వేయడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ గ్రామస్తుల నుండి వినికిడి.చెరువు కట్ట వెంట పెద్ద మొత్తంలో కోళ్ల మృతదేహాలు, వ్యర్థాలు పడేయడంతో దుర్వాసన వ్యాపించి పరిసర ప్రాంతాల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఈ దుర్వాసన కారణంగా రహదారి మీదుగా వెళ్లే ప్రయాణికులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా వ్యర్థాలు పేరుకుపోవడంతో ఈగలు, దోమలు పెరిగి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి పక్కనే ఈ పరిస్థితి ఉండడంతో గ్రామ ప్రతిష్ట దెబ్బతింటుందని స్థానికులు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోళ్ల వ్యర్థాలను తొలగించి, మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *