ప్రాంతీయం

లక్ష్మిపూర్ గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

69 Views
  1. లక్ష్మిపూర్ గ్రామంలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు

సిద్దిపేట జిల్లా బెజ్జంకి, మార్చి 1, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో పోచమ్మ తల్లి, అంతగిరి పోచమ్మ తల్లీకీ గ్రామ ప్రజలందరూ ఏకధాటిగా ఇంటికి ఒక బోనం చొప్పున భక్తిశ్రద్ధలతో ఆదివారం బోనాల పండుగని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ యొక్క బోనాల పండుగను కార్యక్రమాన్ని పురస్కరించుకుని, 6-3-2026 శుక్రవారం రోజున శివాలయంలో జరిగే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి ముందు గ్రామ దేవతలైన పోచమ్మ తల్లి అంతగిరి పోచమ్మ తల్లులకు బోనాలు సమర్పించుకోవడం ఆనవాయితీగా ఉండడంవల్ల సమర్పించుకోవడం జరిగిందని గ్రామ ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, యాసంగి కాలంలో అకాల వర్షాలకు పంటలు, దెబ్బతినకుండా రైతులకు పంటలు చేతుకు రావాలని, గుడ్డు గోదా చల్లగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *